- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ కీలక పరిణామం.. నామినేషనల్ దాఖలు చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన రచనలు, పేరడీ పాటలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా.. ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి గురువారం మధ్యాహ్నం నామినేషనల్ దాఖలు చేశారు. గతేడాది జూన్‌లో 'జై తెలుగు పార్టీ' పేరిట ఆయన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, తెలుగు భాషా పరిరక్షణ కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు జొన్నవిత్తుల వెల్లడించారు. “తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నాను. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడం నా లక్ష్యం. వారిని చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదిక. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయింది. భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయాయి. వాటి విలువల కోసం రాజకీయ నాయకులు, ప్రజలు పనిచేయాలి. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించాను అని గతంలో జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు.