చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు..

by Javid Pasha |
చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు..
X

రాయ్ పూర్: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేత ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. బొగ్గుపై అక్రమంగా వసూలు చేసిన ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సోమవారం ఎనిమిది మంది అధికార కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన 17 నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. వీరిలో ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్ లు కూడా ఉన్నారు. సరిగ్గా ప్లీనరీ సెషన్‌కు 4 రోజుల ముందే ఈ సోదాలు చేపట్టడం గమనార్హం. సీనియర్ నేతలు, ప్రతినిధుల ఇళ్లలో ఈడీ దాడులు చేపట్టిందని పోలీసులు చెప్పారు. కాగా, బొగ్గు రవాణాలో అక్రమంగా టన్నుకు అదనంగా రూ.25 విధించి అవకతవకలకు పాల్పడ్డారని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు, మధ్యవర్తులపై ఈడీ ఆరోపణలు చేసింది.

మరోవైపు మోడీ ప్రభుత్వం తమ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి దాడులు చేస్తుందని విపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రంలో ఈడీ, సీబీఐ సోదాలు జరిగాయని విమర్శించాయి. ఈ సోదాలతో తమ స్పూర్తి దెబ్బతినదని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. ఈడీ సోదాలు థర్డ్ రేట్ పాలిటిక్స్ అని విమర్శించారు. కాగా ఇప్పటివరకు బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో 9 మంది అరెస్టయ్యారు. వారిలో రాష్ట్ర ప్రతినిధులు చౌరాసియా, సూర్యకాంత్ తివారీ, ఐఏఎస్ అధికారితో పాటు వ్యాపారవేత్త ఉన్నారు.


Advertisement

Next Story

Most Viewed