మేనిఫెస్టోలో కాంగ్రెస్ వరాల జల్లు

by GSrikanth |
మేనిఫెస్టోలో కాంగ్రెస్ వరాల జల్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ముఖ్యంగా ఎన్నికల్లో ఓటర్లకు హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. తెలంగాణలో ఆరు గ్యారెంటీలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రాజ్‌నంద్‌గావ్‌లో చ‌త్తీస్‌ఘ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్ 'భరోసా కా ఘోషనా పాత్ర 2023-2028' పేరుతో మేనిఫెస్టో విడుద‌ల చేశారు.

కుల గ‌ణ‌న‌, రుణమాఫీ, 200 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ వంటి పాత హామీల‌ను మేనిఫెస్టోలో పొందుపరిచింది. ధాన్యం క్వింటాల్‌కు రూ.3,200కు కొనుగోలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ అందిస్తామ‌ని, 10 ల‌క్షల వ‌ర‌కూ ఆరోగ్య బీమా వ‌ర్తింప‌చేస్తామ‌ని తెలిపారు. వ్యాపారాల‌కు 50% రుణ మాఫీని వ‌ర్తింప‌చేస్తామ‌ని పేర్కొన్నారు. కాగా, న‌వంబ‌ర్ 7, 17 తేదీల్లో రెండు ద‌శ‌ల్లో ఛత్తీస్‌ఘ‌ఢ్‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు ప్రకటించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed