- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ అనర్హత వేటుపై ప్రియాంక గాంధీ రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా స్పందించారు. రాహుల్ పై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరచడమేనని అన్నారు. పీఎం మోడీని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ.. ‘ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ప్రధానమంత్రి కుమారుడి (రాహుల్ని గాంధీ)ని మీ పార్టీ కార్యకర్తలు మీర్ జాఫర్ తో పోల్చి దేశద్రోహి అన్నారు. మీ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి ‘నీ తండ్రి ఎవరు’ అంటూ రాహుల్ గాంధీని అవమానించారు. మీ తాత నెహ్రూ ఇంటి పేరును ఎందుకు పెట్టుకోలేదని ఎద్దేవా చేస్తూ మా కుటుంబంతో పాటు కశ్మీరీ పండట్లనందరినీ కించపరిచేలా మీరు మాట్లాడారు. కానీ మీకు ఏ జడ్జి రెండేళ్ల జైలు శిక్ష వేయలేదు.. పార్లమెంట్ అనర్హత వేటు వేయలేదు. మీకో న్యాయం మాకో న్యాయమా’ అంటూ మోడీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
వేల కోట్ల దేశ సంపదను కొల్లగొట్టిన లలిత్ మోడీ, నీరవ్ మోడీ, చోస్కీ, అదానీ వంటి వాళ్లపై పార్లమెంట్ సాక్షిగా రాహుల్ పోరాటం చేస్తున్నారని, ఈ కారణంగానే ఆయనను పార్లమెంట్ కు రానీయకుండా మోడీ కుట్రలు పన్నారని ఆరోపించారు. ‘‘తరతరాలుగా ఈ దేశం కోసం మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. నీలాంటి పిరికిపందలు, నియంతల ముందు మేము ఏనాడు తల వంచలేదు. ఇక ముందు కూడా వంచే ప్రసక్తిలేదు. ఏం చేస్కుంటరో చేస్కోండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.