- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునర్నిర్మాణంపై ఎమన్నారంటే..?
దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. 2019 తర్వాత అమరావతి పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ భవన నిర్మాణాలు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకునేందుకే సీఎం చంద్రబాబు రాజధాని అంతటా పర్యటిస్తున్నారు.
ప్రజావేదికను కూల్చేసిన వైసీపీ..
ప్రజలు తమ సమస్యలను నిరభ్యంతరంగా వ్యక్తపరిచేందుకు, అలానే ఆ సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు టీడీపీ హయాంలో ప్రజావేదికను సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేసథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజావేదికను అక్రమకట్టడం అని ఆరోపిస్తూ కూల్చేశారు. ప్రజావేదికను కూల్చేసిన తరువాత కనీసం ప్రజావేదిక శిథిలాలను సైతం అక్కడ నుండి తొలిగించ లేదు.
శిథిలావస్థలో అమరావతి..
రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అలానే రాజధాని నిర్మాణం పనులు సైతం చేపట్టారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణాలను70% పూర్తి చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని గాలికి వదిలేసింది. దీనితో రాజధాని నిర్మాణాలు శిథిలా వస్థకు చేరుకున్నాయి.
వైసీపీ విధ్వంస పాలనకు గుర్తుగా అది అలానే ఉండాలి..
కాగా నేడు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మెదటగా వైసీపీ కూల్చేసిన ప్రజావేదికను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాటుతూ.. అలానే వైసీపీ విధ్వంస పాలనకు గుర్తుగా అది అలానే ఉండాలని, తిరిగి ప్రజావేదికను నిర్మించబోమని తేల్చి చెప్పారు.