గాడ్స్ స్క్రిప్ట్.. నాడు ఆకాశాన జగన్ చూపు.. నేడు నేలకు దించిన బాబు..

by Indraja |   ( Updated:2024-06-11 11:17:40.0  )
గాడ్స్ స్క్రిప్ట్.. నాడు ఆకాశాన జగన్ చూపు.. నేడు నేలకు దించిన బాబు..
X

దిశ వెబ్ డెస్క్: నేటి స్థితిని చూసి మురవకు, రేపటి మర్మం తెలియదు రోజు మారే వరకు అన్నారు ఓ మాహానుభావుడు. చులకనగా చూసిన చిత్తుకాగితమే గాలిపటంమై ఎగిరితే తల ఎత్తి చూడాల్సి వస్తుంది. అలాంటిది రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచి అప్పటికే మూడుసార్లు రాష్ట్రానికి సీఎంగా సేవలందించిన నారా చంద్రబాబును అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానించారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనే విషయాన్ని మరిచి, అధికార దర్పంతో గర్వాన్ని ప్రదర్శించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తే.. టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అయితే ప్రజలు తమకు మేలు చేస్తారని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లిన జగన్ మొదటి రోజు నుండి ప్రతిపక్ష నేతలను గేలిచేయడమే పనిగా పెట్టుకున్నారని అప్పట్లో పలువురి విమర్శించారు.

దీనికి కారణం ముఖ్యమంత్రిగా చట్ట సభలో ప్రజాసమస్యలపై ప్రస్తావించాల్సిన జగన్ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటమిని ఎగతాలి చేయడమే. నాడు 151 సీట్లను దక్కించుకున్నామనే గర్వంతో అప్పటి సీఎం జగన్ గౌరవప్రదమైన చట్ట సభను కురుసభగా మార్చారు. ప్రజల సమస్యలు ఏంటో తెలుసా అధ్యక్షా అనాల్సిన సీఎం, ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్షా అక్షరాల 23 సీట్లు, ముగ్గురు ఎపీలను కొన్నవారికి వచ్చిన ఎపీ సీట్లు ఎన్నో తెలుసా అక్షరాల 3, ఇంత గొప్పగా జరిగింది అంటే అది దేవుడు ఎంత గొప్పగా స్ర్కిప్ట్ రాస్తాడో చెప్పడానికి నిదర్శనం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసి, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఈ రెండు కూడా చట్ట సభలో మళ్లీ ఇవాల చూస్తున్నాం, అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా ఇవాల అందరం సమావేశమయ్యాం అని చంద్రబాబు ఓటమిని వెక్కిరిస్తూ మాట్లాడారు.

ఆ మాటలకు అసెంబ్లీలో ఉన్న వేసీపీ శ్రేణులు చప్పట్లు కొట్టగా, జగన్ పైశాచిక ఆనంధాన్ని పొందారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే 2019లో టీడీపీకి వచ్చిన సీట్లలో సగం కూడా రాలేదు. మరి ఇది కూడా అన్యాయం చేసిన వారిపట్ల దేవుడు రాసే స్క్రిప్ట్‌కు నిదర్శనమే అంటారా జగన్ అన్న అని, గాడ్స్ స్ర్కిప్ట్ అదుర్స్ అంటూ పలువురు జగన్‌ను ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

Next Story