Nara Chandrababu: ఏపీలో వరుస దాడులు.. కార్యకర్తలకు చంద్రబాబు కీలక పిలుపు

by Indraja |   ( Updated:2024-06-08 04:44:44.0  )
Nara Chandrababu: ఏపీలో వరుస దాడులు.. కార్యకర్తలకు చంద్రబాబు కీలక పిలుపు
X

దిశ వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన 2024 ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటితో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 12న అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే టీడీపీ దాడులకు పాల్పడుతుందని X వేదికగా స్పందించారు. పార్టీనేతలు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రంలో పలు చోట్ల నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేతల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ క్యాడర్, నాయకులు వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ టీడీపీ కార్యకర్తలు, మధ్యశ్రేని నాయకులు సంయమనం పాటించాలని, ఎటువంటి దాడులు, ప్రతిదాడులకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. అలానే రాష్ట్రంలో ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను చంద్రబాబు ఆదేశించారు. అలానే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed