- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే
దిశ వెబ్ డెస్క్: ఇటు ఆంధ్రా ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, మొదటి సంతకం ఏ ఫైల్ పైన పెడతారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతోంది. అయితే గతంలో ప్రజాగళంలో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ.. జగ్గంపేటలో ఓ ఆడబిడ్డ తనకు పెన్ ఇచ్చిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పెన్నుతో డీఎస్సీ పై మొదటి సంతకం చేయాలని ఆమె తనని కోరిందని తెలిపారు.
కాగా ఆమె కోరిక ప్రకారం తాను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డీఎస్సీ పైన చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలానే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, గతంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ పైన పెడతారని అందరూ భావిస్తున్నారు.