AP Politics: ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. పరేషాన్‌లో జగన్..

by Indraja |   ( Updated:2024-06-09 13:03:00.0  )
AP Politics: ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. పరేషాన్‌లో జగన్..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెల్లడైన 2024 ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 164 సీట్లను గెలుచుకొని అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కాగా ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే టీడీపీ గెలుపులో బీసీల ప్రాధాన్యత ఎంతో ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఓటు బ్యాంక్‌ను నింపింది బీసీలే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పలువురి అభిప్రాయం.

మెదటి నుండి చంద్రబాబునే నమ్మిన బీసీలు మరోసారి తమకు విశ్వాసపాత్రుడైన నాయకుడు చంద్రబాబు అని నిరూపించారు. అలానే కమ్మ సామాజిక వర్గం సైతం చంద్రబాబును గుండెల్లో పెట్టుకుందని, మొదటి నుండి బాబు గెలుపుకు కృషి చేసిందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో అటు కమ్మ, ఇటు బీసీ రెండు సామాజిక వర్గాలకు సామాజిక న్యామం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును క్యాబినెట్ మంత్రిగా, అలానే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను సహాయ మంత్రిగా నియమించేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈరోజు రాత్రి 7 గంటల 12 నిమిషాలకు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా అలానే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

కగా గత ప్రభుత్వం హయాంలో బీసీలను బీసీలను తన వైపు తిప్పుకునేందుకు వైసీపీ సాయశక్తులా ప్రయత్నించి విఫలమైంది. బీసీల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని జగన్ చెప్పినప్పటికీ, వాటిలో కొన్ని అమలు చేసినప్పటికీ బీసీలను తన వైపు తిప్పుకోవడంలో వైసీపీ విఫలమైంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తాను బీసీల కోసం ఎన్ని మంచి పనులు చేసినా బీసీలు మాత్రం చంద్రబాబునే నమ్మరాని, తనని ఎందుకు నమ్మలేదు అని మాజీ ముఖ్యమంత్రి పరేషాన్ అవుతున్నట్లు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story