- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: సకుటుంబ సమేతంగా టీడీపీ అభ్యర్థి ప్రచారం
దిశ, ఒంగోలు: వలేటీవారి పాలెంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దామచర్ల జనార్థన్ సతీమని నాగసత్యలత, కుమార్తె అనీషా లక్ష్మి, దామచర్ల జనార్థన్ అక్క మాధవీ లత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెల్లెళ్లు సంధ్య, సుధ, సురేఖ.. వలేటివారిపాలెంలో పర్యటించారు.
ప్రతి ఇంటికీ తిరుగుతూ మహిళలు, వృద్ధలతో మాట్లాడారు. అలానే టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల ద్వారా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళా నిథి పథకం ద్వారా ప్రతి మహిళకు 1500 రూపాయలు అందిస్తామని తెలిపారు.
దామచర్ల కుమార్తె అనీషా లక్ష్మి మాట్లాడుతూ.. దామచర్ల జనార్థన్ వలేటివారిపాలెం గ్రామాన్ని దత్తతు తీసుకుని గ్రామాభివృద్ధికి సుమారు మూడు కోట్లతో అభివృద్ధి చేశారని తెలిపారు. గ్రామంలో ఎవర్ని పలకిరించినా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని.. ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. అలానే రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రజలు తమకు తెలిపారని వెల్లడించారు.