Breaking: మాజీ సీఎం జగన్ రాజీనామా.. కడప పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్..?

by Indraja |   ( Updated:2024-07-06 10:02:47.0  )
Breaking: మాజీ సీఎం జగన్ రాజీనామా.. కడప పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్..?
X

దిశ వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్షాన్ని సైతం కైవసం చేసుకోలేక పోయింది. దీనితో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

దీనితో అసెంబ్లీ ప్రారంభమైన మెదటి రోజు తప్ప ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఆయన అసంబ్లీలో కనిపించలేదని పలువురు పేర్కొంటున్నారు. అసెంబ్లీకి వెళ్లినా అక్కడ మాట్లాడే అవకాశం ఉండదని జగన్ భావించారని అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కడప పార్లమెంట్‌కు బై ఎలక్షన్స్ జరుగనున్నాయనే వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతున్నాయి.

పార్లమెంట్‌పై వైసీపీ అధినేత ఆశక్తి..

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్లాలనే ఆశక్తి లేదని, పార్లమెంటుకు వెళ్తే అక్కడ ఇండియా కూటమి సైతం ఉంది కనుక తాను మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలు సైతం జగన్‌ నిర్ణయాన్ని సమర్ధించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సైతం రూపుదిద్దుకుంటున్నట్టు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడైకూస్తోంది.

ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా, అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా త్వరలో ఇరువురు రాజీనామ చేయనున్నట్టు, ఆ తరువాత జరిగే ఉప ఎన్నికల్లో జగన్ కడప నుండి ఎంపీగా పోటీలో నిలవగా, విజయమ్మను పులివెందుల ఎమ్మెల్యేగా బరిలో దించేలా వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.

ఉప ఎన్నికల వ్యూహం.. మొదటికే మోసం..

ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇక 2024 ఎన్నికల్లో కడప ఏంపీగా అవినాష్ రెడ్డి అత్యల్ప మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగితే మెదటికే మోసం వస్తుందని, అదే జరిగితే కనీసం ఇప్పుడు ఉన్న పదవి సైతం పోతుందని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. గుడ్డికంటే మెల్ల మేలు అనే సామెతను వైసీపీ గుర్తుంచుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed