- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడడం శోచనీయం.. బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళ లేనిదే సృష్టి లేదు.. ఈ సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడడం శోచనీయమని బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హక్కుల కోసం సమాన వేతనాల కోసం కొట్లాడిన మహిళ నేడు ఇంకా అవకాశాల కోసం పోరాడడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిసి దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన జనాభాలో సగం ఉన్న మహిళలకు 33 శాతం చట్టసభల్లో మా రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడితే ప్రతిపక్షంలో మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరుగున పెట్టిందన్నారు. ఈ విషయంలో బీజేపీకి అవకాశమిచ్చి ఎనిమిదేళ్లు దాటి పోయిందన్నారు. ఈ దేశంలో ఉన్న మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆడ బిడ్డను కంటికి రెప్పలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని తెలిపారు. మహిళలకు ఏ అవకాశాలు రాకుండా కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. కవితకు నోటీసులు ఈడి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా అనేది ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి, ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడని చెప్పారు.
దేశంలో దళితులు, గిరిజనులు పేద వర్గాలకు బీజేపీ అధికారంలోకి వచ్చాక తీవ్ర అన్యాయం చేస్తుందని, ఈ విషయాలను కేసీఆర్ ఎండ కడతారనే భయంతో అభివృద్ధి పాలనకు అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. కవిత కృషి ఫలిస్తుందని, మహిళా శక్తికి కేంద్రం తలవంచక తప్పదన్నారు. హైదరాబాదులో దీక్ష పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతుందని, ఈ రిజర్వేషన్ సాధించేవరకు మేమంతా కవితకు తోడుగా ఉంటామని తెలియజేశారు.