ఎన్నికల ప్రచార ఖర్చులో BJP టాప్.. రెండో స్థానంలో ఉన్న పార్టీ ఇదే!

by GSrikanth |   ( Updated:2023-01-28 14:03:03.0  )
ఎన్నికల ప్రచార ఖర్చులో BJP టాప్.. రెండో స్థానంలో ఉన్న పార్టీ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ప్రకటనలు, ఎన్నికల ప్రచారాల కోసం ఖర్చు చేస్తున్న వాటిలో బీజేపీ పార్టీ టాప్‌లో నిలిసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ప్రకటనలు, ప్రచారాల కోసం చేసిన ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. ఇందులో కమలం పార్టీ ప్రకటనలు, ప్రచారం కోసం రూ.313.17 కోట్లు ఖర్చు చేసి టాప్ లో నిలిసింది.

ఆ తర్వాతి స్థానంలో రూ.279.73 కోట్లతో కాంగ్రెస్ నిలిచిందని నివేదిక పేర్కొంది. టీఎంసీ రూ.268.33 కోట్లు, బీఎస్పీ 85.17 కోట్లు తమిళనాడులోని డీఎంకే రూ.35.40 ఆమ్ ఆద్మీ పార్టీ రూ.30.29 కోట్లు ఖర్చు చేయగా సీపీఎం పార్టీ రూ.83.41 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ రూ.7.12 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రూ.25.57 కోట్లు ఖర్చు చేయగా బిహార్ లోని నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ రూ.4.15 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. అయితే ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం ఏపీలోని అధికార వైసీపీతో పాటు ఎన్సీపీ, సీపీఐలు ప్రకటనల కోసం ఎటువంటి మొత్తాన్ని ఖర్చు చేయలేదని పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed