- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ.. పార్టీ బలోపేతానికి తీవ్ర ప్రయత్నం!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండగా పొలిటికల్ హీట్ పెరుగుతున్నది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలపైనే అన్నిప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అక్కడ అధికార బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తున్నది. ఇక దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన కాషాయ పార్టీ కర్ణాటకలో పవర్ కాపాడుకుంటూనే తెలంగాణలోనూ రూలింగ్‌లోకి వచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంది. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కమలదళ నేతలు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రోగ్రామ్స్ సందర్భంగా వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పర్యటించారు. ఇప్పుడు కన్నడనాట ప్రచారంలో భాగంగా.. అటునుంచి పనిలో పనిగా తెలంగాణనూ టచ్ చేయాలని భావిస్తున్నారు.
‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా బీజేపీ స్కెచ్ వేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంతో పాల్గొనే పలువురు పార్టీ నేతలను తెలంగాణకు సైతం వెళ్లి విజిట్ చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కర్ణాటక, తెలంగాణ బోర్డర్ కు సమీపంలోని ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా విజిట్ చేసే అవకాశాలున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణలోనూ పర్యటించనుండడాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈనెల23న అమిత్ షా రాక సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. అయితే షా కర్ణాటక ప్రచారం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో రాష్ట్రానికి వస్తారా? లేక బహిరంగ సభ అనంతరం కర్ణాటకకు వెళ్తారా? అనేదానిపై స్పష్టత రాలేదు.
కన్నడనాట కమలం ధీమా
కర్ణాటక ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లకు కీలకంగా మారాయి. అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ, పవర్ లోకి రావాలని కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కాషాయ పార్టీ కన్నడ ఎన్నికలను, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎలా పని చేయనుందనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ పర్యటనలు చేపట్టాలనుకోవడం చూస్తుంటే కర్ణాటక పీఠం తమదేననే ధీమా బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా.. వికారాబాద్ లో అమిత్ షా సభ నిర్వహణపై బీజేపీ రాష్ట్ర ఆఫీసులో పార్టీ పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీ, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశంకానున్నారు. జన సమీకరణ వంటి అంశాలపైనా చర్చించనున్నారు.