- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: పద్మనాభ ‘రెడ్డి’ మాకొద్దు.. ముద్రగడకు ప్రముఖ నేత బహిరంగ లేఖ..
దిశ, ఉభయగోదావరి జిల్లాల ప్రతినిధి: ఇటీవల జరిగిన ఎన్నికలలో ముద్రగడ పద్మనాభం బలపరచిన వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలవటంతో ఆయన రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలిసిందని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి తెలిపారు.
సోమవారం అయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ముద్రగడను కొన్ని వివరాలు కోరారు. రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? మా రెడ్ల పరువు తీయడానికే మీరు చేరాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
రెడ్డి సంఘం సభ్యులకు ప్రశ్నలు..
కోస్తా ఆంధ్రా రెడ్డి సంఘ సభ్యులకు కర్రి వెంకట రామారెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. కాపు వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం.. రెడ్డి జాతిలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గౌరవంగా బ్రతికే రెడ్లు, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లులో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నారు.
ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచాల్సిన అవసరం సంఘ సభ్యులకు ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తులను రెడ్లలో చేర్చుకోవటం లేదని ప్రకటించాలని సూచించారు. ముద్రగడ రెడ్లలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పంచ్‌గా, రెడ్డి సభ్యుడిగా నేను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.