- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీడబ్ల్యూసీకి నో ఎలక్షన్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. అందరి సమ్మతితో సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే అప్పగించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
అయితే ఈ విషయంలో పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీకి నేరుగా ఎన్నికోవాలన్న మల్లికార్జున ఖర్గే ప్రతిపాదనను అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్లు వ్యతిరేకించినట్లు టాక్ వినిపిస్తోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో సింఘ్వీ మాత్రం ఈ ఎన్నికలు ఇప్పుడు కాకపోయినా 2024 ఎన్నికల తర్వాత అయినా నిర్వహించాల్సిందే అనే చెప్పినట్లు టాక్.
పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడం తిరిగి పార్టీలో దళారీ సంస్కృతిని తొలగించేందుకు చేస్తున్న పోరాటానికి మరోసారి ద్రోహం జరిగినట్లే అనే అభిప్రాయాలో మరి కొంత మంది నేతల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని ఖర్గే నాయకత్వంపై నమ్మకం ఉందని దినేశ్ గుండు రావు వంటి నేతలు క్లారిటీ ఇస్తున్నారు.