- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Father's Love: కన్న ప్రేమ కోసం ఓ తండ్రి ఆవేదన..
దిశ వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి ఉపాధి పనుల నిమిత్తం 2016 లో ముంబాయి వెళ్ళారు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడుగా పని చేస్తూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో అతనికి బంగ్లాదేశ్ కి చెందిన రియా అనే ఓ యువతి పరిచయం అయ్యింది. రోజులు గడిచే కొద్ది ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీనితో వారిరువురు పెళ్లి చేసుకున్నారు.
కాగా వారికి 2017లో విశాల్ అనే అబ్బాయి జన్మించారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో రియా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తిరుపతి నుండి విడాకులు సైతం తీసుకుంది. ఈ నేపథ్యంలో తన కొడుకుని తనకి ఇవ్వాలని తిరుపతి ఎంతగా ప్రాధేయపడినా రియా అందుకు అంగీకరించలేదు. కనీసం ఆ బిడ్డని ప్రేమగా చూస్తుందా అంటే అదీ లేదు అని తిరుపతి తెలిపారు.
రియా తన మూడ వ భర్తతో కలిసి తన కుమారుడుని కొడుతూ, చిత్రహింసలు పెడుతూ తనని డబ్బులు అడుగుతుందని తిరుపతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇప్పటికే ముంబై పోలిసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనితో అతను కరీంనగర్‌కి వచ్చి నిన్న కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్‌ని కలిసి తన కొడుకును తనకి ఇప్పింఛాలని వేడుకున్నాడు.