నోముల మృతి పట్ల రాజకీయ నేతల సంతాపం

by Shyam |
నోముల మృతి పట్ల రాజకీయ నేతల సంతాపం
X

దిశ, వెబ్‎డెస్క్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. నోముల ఆకస్మిక మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే నోముల మృతిపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు స్పందించారు. నోముల ఆకస్మిక మరణం దురదృష్టకరమన్నారు. జీవితాంతం ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్య అన్నారు. నోముల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నోముల నర్సింహయ్య మరణం పట్ల మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తదితరులు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నోముల రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని.. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులంటూ నోముల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానంటూ కవిత ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story