సామాన్య నిందితుడికి అసామాన్య భద్రత

by Sridhar Babu |   ( Updated:2020-06-08 00:22:22.0  )
సామాన్య నిందితుడికి అసామాన్య భద్రత
X

దిశ, కరీంనగర్: ఓ సాధారణ వ్యక్తి చనిపోతే పోలీసులు అసాధరణ భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఎదురైంది. వీఐపీలు చనిపోయినప్పుడు మాత్రమే కనిపించే భద్రతా వలయం ఓ సామాన్య నిందితుడికి కల్పించాల్సి రావడం విచిత్రమే. కానీ, పోలీసులకు తప్పలేదు మరీ.. ఇంతకీ ఏం జరిగింది.. పోలీసులు సెక్యూరిటీ ఎందుకు కల్పించారో తెలుసా…?

మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన రెవెల్లి సంతోష్ కుమార్ (23) పది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అతని తండ్రి జంపయ్యను భూపాలపల్లి పోలీసులు ఇటీవలే చోరీ కేసులో అరెస్ట్ చేశారు. అయితే తన తండ్రి పోలీసుల విచారణలో తన పేరు కూడా చెప్తాడేమోనన్న భయంతో సంతోష్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని వెంటనే చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సంతోష్ కుమార్ అంత్య క్రియలకు జంపయ్య హాజరు కావాల్సి ఉండడంతో పరకాల సబ్ జైలు నుంచి పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఊటూరుకు తీసుకొచ్చారు. ఏఆర్ పోలీస్ బలగాల బందోబస్తు నడుమ జంపయ్యను తీసుకరాగా స్థానిక పోలీసులు కూడా నిఘా వేయాల్సి వచ్చింది. సంతోష్ అంత్యక్రియలకు పోలీసులు అసామాన్య భద్రత కల్పంచాల్సి వచ్చింది. ప్రముఖులు చనిపోయినప్పుడు మాత్రమే బందోబస్తు నిర్వహించే పోలీసులు చోరీ కేసుల్లో నిందితుడి కొడుకు చనిపోవడంతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

నో లాక్ డౌన్ రూల్స్…

ఊటూరులో భారీగా వచ్చిన పోలీసు బలగాల సాక్షిగా లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేశారు. వారి సమక్షంలోనే నిబంధనలకు విరుద్ధంగా శవయాత్ర నిర్వహించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయించాల్సిన పోలీస్ అధికారుల కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed