- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో ఉద్రిక్తత.. బీజేపీ ప్రెస్‌మీట్‌లో పోలీసులు హాల్‌చల్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక శనివారం జరుగనుంది. ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలోనూ రాజకీయం వేడెక్కింది. ఈ సందర్భంగా ఓటర్లకు డబ్బుల కవర్లు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్ నేతలు వరంగల్ నుంచి ప్రెస్‌మీట్ ద్వారా గురువారం స్పందించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మలు శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని హోటల్ గ్రాండ్ గాయత్రీలో ప్రెస్‌మీట్ కోసం సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకొని మీటింగ్‌ను అడ్డుకున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్‌లో పాల్గొనడానికి పర్మిషన్ లేదని ఏసీపీ గిరికుమార్ మీటింగ్‌ను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో రావు పద్మ, ప్రేమేందర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఈటల రాజేందర్ హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ‘వరి’, ఉప ఎన్నిక విషయంపై మాట్లాడటానికి ప్రెస్‌మీట్ పెడితే అడ్డుకోవడం సరికాదని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే గురువారం టీఆర్ఎస్ నాయకులు ప్రెస్‌మీట్ పెడితే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.