- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడికి గుండు కొట్టించిన పోలీసులు.. ఎందుకంటే !
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి గాయాలు అయ్యేలా కొట్టి శిరోముండనం చేశారు. మీసాలు కూడా కత్తిరించారు. అయితే ఆ యువకుడు మాత్రం తాను ఇసుక లారీలను ఆపినందునే పోలీసులు తీసుకువచ్చి కొట్టారని ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక వైసీపీ నేత వచ్చి కారుతో ఢీకొట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. వైసీపీ నేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలైన యువకుడిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెదుళ్లపలిలోని బాధితుడి ఇంటికి వెళ్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. సీతానగరంలో ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.