శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం

by Sridhar Babu |
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
X

దిశ, హుస్నాబాద్:
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. కోహెడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ…హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరం సమీపంలో అసాంఘిక శక్తులు పెట్టిన మందుపాతరకు ఎస్ఐ జాన్ విల్సన్, సీఐ యాదగిరితోపాటు మరో 13మంది బలయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐలు శ్రీధర్, రవి, రాజుకుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story