- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోల కోసం పోలీసుల వేట.. అగ్రనేత భాస్కర్ ఎస్కేప్
దిశ, ఆదిలాబాద్/బెల్లంపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసులు గత మూడ్రోజుల వేట కొనసాగిస్తున్నారు. బుధవారం పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి పక్కా సమాచారంతో లింగాపూర్ అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక ఇంట్లో మావోలు ఉన్నట్టు సమాచారం అందింది. వారిని బయటకు రావాలని హెచ్చరించినట్టు పోలీసులు చెబుతున్నారు. అనంతరం ఇరువర్గాల నడుమ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అందులో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు త్రుటిలో తప్పించుకున్నట్టు సమాచారం. తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు ఉన్నట్టు తెలిసింది. మావోయిస్టు పార్టీ జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో పోలీసులు ఒక్కసారిగా అడవులను జల్లెడ పట్టడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరువర్గాల నడుమ కాల్పులు జరిగిన నేపథ్యంలో మావోయిస్టులు, పోలీసులు ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటవీ గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్ కోసం ప్రత్యేక పోలీసు బలగాలు మంగి, పంగిడి మాధర, రొంపల్లి, లింగాపూర్ అడవులను జల్లెడ పడుతున్నాయి.
అవును తప్పించుకున్నారు : ఎస్పీ విష్ణు
మావోయిస్టులు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవేశించారన్న సమాచారంతో కూంబింగ్ చేస్తున్న తమ పోలీసులకు తిర్యాని మండల గ్రామాల్లోని ఒక గ్రామమైన తొక్కుగూడలో అలివ్ గ్రీన్ దుస్తులు ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాలతో ఉన్న మావోయిస్టులు తారసపడినట్టు ఎస్పీ తెలిపారు. పోలీసులను చూసి వెంటనే మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు ఎదురుకాల్పులు చేసినట్టు వివరించారు. ఆ సమయంలో చీకటిం కావడంతో మావోయిస్టులు తప్పించుకున్నారని తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టులలో తెలంగాణ రాష్ట్ర కమిటీ, మంచిర్యాల, కొమురంభీం డివిజన్ సెక్రెటరీలు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, వర్గేష్, మంగు, అజయ్, రాము ఉన్నారని తెలిపారు. వీరి కోసం తిర్యాని అడవులను ప్రత్యేక పోలీసు బలగాలతో గాలింపు చేస్తున్నామని వారు లొంగిపోతే మంచిదన్నారు.