- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధికారుల హస్తం..! దావూద్ అనుచరుడు, రోహింగ్యాలకు పాసుపోర్టులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బోదన్.. బహుధాన్యపురంగా, బకాసురుడు పాలించిన గడ్డగా, ‘ఆస్మక’ రాజాధానిగా.. బాహుబలి పాలన కొనసాగిన ప్రాంతంగా ప్రసిద్ధి. జైనుల మొదలు.. అసఫ్ జాహీలు ఏలిన నేలగా.. నిజాం కాలంలోనే ఆసియాలోకెళ్ల అతిపెద్ద చక్కెర కర్మాగారం గుర్తింపు ఉంది. అలాంటిది బంగ్లా దేశీయులకు బోదన్ స్థానికులుగా స్పెషల్ బ్రాంచ్ పోలిస్‌ల కనుసన్నుల్లో 72 మందికి పాస్ పోర్టులు ఇచ్చిన విషయంతో అందరూ నివ్వేరపోతున్నారు.
అండర్ వరల్‌కు ఇక్కడి నుంచే పాస్ పోర్టులు..
నెల రోజులుగా రోహింగ్యాలకు బోదన్ నుంచి పాస్ పోర్టుల జారీ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ ఇక్కడ నుంచి స్థానికేతరులకు, ఫేక్ పాస్ పోర్టులు జారీ కావడం కొత్తేమీ కాదు. 2001లో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు అబు సలేం ప్రియురాలు, నటి మోనికా బేడీ(తాజ్ మహల్ హీరోయిన్)కు బోదన్ వాసిగా పాస్ పోర్టులు దొరికాయి. టాడా కేసులో నిందితుడిగా ఉన్న అబూసలేం నాడు దేశం విడిచి పరారీలో ఉండగా.. పోర్చుగల్లో పట్టుబడగా తన భార్యగా మోనికా బేడీకి నిజామాబాద్ జిల్లా బోదన్ తో పాటు కర్నూల్ జిల్లా వాసిగా రెండు పాస్ పోర్టులు లభించాయి. ఈ కేసులో అప్పటి ఎస్పీ రవి శంకర్ అయ్యన్నార్ మొత్తం 11 మంది ఈ కేసులో ఇన్ వాల్వ్ అయినట్లు గుర్తించి కేసులు నమోదు చేయించారు.
పోలీసులపై చర్యలు శూన్యమా?
తాజాగా 20 సంవత్సరాల తరువాత రోహింగ్యాలకు పాస్ పోర్టులతో మరోసారి బోదన్ పేరు మారు మార్మోగుతుంది. ఇద్దరు ఎస్బీలో పనిచేసిన వారు 72 మందికి పాస్ పోర్టులను ఇప్పించి సొమ్ము చేసుకోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ వ్యవహరంలో పోలీస్ శాఖ, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇద్దరు.. నాటి ఎస్బీ అధికారులతో పాటు పరిమళ్ బేన్ అనే రోహింగ్యాను, ఇద్దరు మీ సేవా నిర్వహకులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. పోలీసులు మినహా మిగిలిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా రోహింగ్యాలకు పాస్ పోర్టు పాత్రధారులను వదిలేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోహింగ్యాలకు పాస్ పోర్టుల జారీకి ఎన్ఓసీ ఇచ్చిన ఇద్దరు పెద్ద ఎత్తున పైరవీలు చేసి కేసు నుంచి తప్పించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.