గుడ్‌న్యూస్.. పోలీసు కొలువు కావాలంటే ఉచిత శిక్షణ

by Anukaran |   ( Updated:2021-07-04 09:40:37.0  )
గుడ్‌న్యూస్.. పోలీసు కొలువు కావాలంటే ఉచిత శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు ఉచితంగా పోలీసు ఉద్యోగ శిక్షణలు అందించేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఎస్సై పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు హైదరాబాద్‌లో ఉచిత వసతి, భోజన సదుపాయంతో శిక్షణలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న వనపర్తి, 11న షాద్‌నగర్, 17న యాదాద్రి భవనగిరి జిల్లా ఆలేరు, 18న సంగారెడ్డిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు 9542433427 వాట్స్‌ అప్ నెంబర్‌, క్యూఆర్ కోడ్‌తో ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల యువత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలు విధించారు.

Advertisement

Next Story

Most Viewed