- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్‌థింగ్ స్పెషల్: మాస్కులు పెట్టుకోవాలని పువ్వులతో..
by Aamani |
X
దిశ,ఎల్లారెడ్డి: పట్టణంలో శుక్రవారం ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు ధరించాలని షాప్ యజమానులు, పాదాచారులకు పువ్వులు ఇచ్చి వినూత్నంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ. . షాప్ యజమానులు మరోసారి మాస్కులు పెట్టుకోకపోతే షాపులను మూసివేస్తామన్నారు. షాపుకు సరుకులు కొనుగోలు కోసం వచ్చే వినియోగదారులకు మాస్కు పెట్టుకుంటేనే సరుకులు ఇవ్వాలని, లేకపోతే షాపు యజమానులకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోందని, ప్రజలు 10 తరువాత అనవసరంగా బయటకు వస్తే జరిమానాలు విధించి వాహనాలపై సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్సై శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story