పురానాపూల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

by Anukaran |   ( Updated:2020-10-19 01:31:31.0  )
పురానాపూల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో చాలా చోట్ల రోడ్లన్నీ నదులను తలపించాయి. అనేక ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ఉధృతికి వాహనాలు సైతం నీళ్లలో కొట్టుకుపోయాయి. తాజాగా సోమవారం పాతబస్తీ పరిధిలోని 400 ఏళ్లు పైబడిన పురానాపూల్ బ్రిడ్జి పిల్లర్ ఒకటి ఆదివారం కుంగిపోయింది.

దీంతో పోలీసులు ఆ బ్రిడ్జిపై నుంచి రాకపోకల్ని నిలిపివేశారు. మరమ్మత్తుల అనంతరం రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుతమైన కట్టడాల్లో ఈ బ్రడ్జి కూడా ఒకటి. అంతేగాకుండా హైదరబాద్ నగరంలో నిర్మించిన తొలి వంతెన ఇదే అని తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed