వీఆర్ఏలపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

by Sridhar Babu |
వీఆర్ఏలపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, ఖమ్మం రూరల్: విధుల్లో ఉన్న వీఆర్ఏలను తిట్టి, గల్లా పట్టుకుని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై శనివారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… తీర్థాల రెవెన్యూలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని సమాచారం మేరకు ఖమ్మం రూరల్ తహసీల్దార్, గిర్థావర్ ఆదేశాల మేరకు లింగం వెంకమ్మ, పెరుమాళ్లపల్లి మురళీ మోహన్‌రావు తీర్థాల, గోళ్లపాడు వీఆర్ఏలు శుక్రవారం అక్రమ కట్టడాన్ని ఆపేందుకు వెళ్లారు. కట్టడాన్ని ఆపాలని కోరగా.. బానోతు వీరన్న, అంగోతు దస్త్రూ అనే వ్యక్తులు వీఆర్ఏల ఇద్దరిపై దాడి చేశారు.

తహసీల్దార్, గిర్థావర్లను సైతం అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అడిగితే దాడులు చేస్తున్నారని, ఇలాంటి సంఘటలను పునరావృతం కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు వెంకమ్మ, మురళీ మోహన్‌రావు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ శంకర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed