అర్ధరాత్రి దారుణ హత్య.. తల్లిని అలా అన్నాడని గొంతుకు అది బిగించి

by Sumithra |   ( Updated:2021-09-02 00:00:19.0  )
అర్ధరాత్రి దారుణ హత్య.. తల్లిని అలా అన్నాడని గొంతుకు అది బిగించి
X

దిశ, వెబ్‌డెస్క్: బొంతపాడు బస్సు స్టేష్టన్ లో గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28 న జరిగిన ఈ హత్య కేసులో మస్తాన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పెద్దజాగర్లమూడి గ్రామానికి చెందిన బొడ్డు మస్తాన్, మృతుడు అట్లూరి శ్రీనివాసరెడ్డి కలిసి వ్యవసాయం చేస్తుండేవారు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి భార్య అనారోగ్యంతో మృతిచెందింది. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డి మద్యానికి బానిసై మస్తాన్ తో తన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడేవాడు.

నీ తల్లికి మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు.. మేము ఇద్దరం సహజీవనం చేస్తే ఎలా ఉంటుంది అంటూ కొడుకు మస్తాన్ ముందే అసభ్యంగా మాట్లాడేవాడు. అలా మాట్లాడొద్దని మస్తాన్ ఎన్నిసార్లు చెప్పినా శ్రీనివాసరెడ్డి వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం శ్రీనివాసరెడ్డి ఒడిశాలో బంధువుల ఇంటికి వెళ్లాలని చెప్పి, బస్సు ఎక్కించమని మస్తాన్‌ను కోరాడు. గుంటూరు బస్టాండ్‌కు వెళ్లేటప్పటికి బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరూ ఏటుకూరు సమీపంలో పొలాల్లో మద్యం సేవించారు. మద్యంమత్తులో మరోసారి శ్రీనివాసరెడ్డి, మస్తాన్ తల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన మస్తాన్ పక్కనే ఉన్న బండతో శ్రీనివాసరెడ్డి తలపై మోది, మెడలోని కండువాను గొంతుకు బిగించి హత్య చేసి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో మృతదేహాన్ని పడేసి పట్టాను కప్పేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడని, అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed