బ్లాక్‌మార్కెట్‌లో బ్లాక్‌ ఫంగస్ ఇంజెక్షన్లు.. రెండు ముఠాలు అరెస్ట్

by Sumithra |
బ్లాక్‌మార్కెట్‌లో బ్లాక్‌ ఫంగస్ ఇంజెక్షన్లు.. రెండు ముఠాలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు సంబంధించిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, వారినుంచి 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. ఇక్కో ఇంజెక్షన్‌ను రూ. 35 వేల నుంచి రూ. 50 వేల చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ ముఠాలు నగరంలోని ఎస్‌ఆర్‌నగర్, బంజారాహిల్స్‌లలో ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story