వదిన ఆత్మహత్య.. వీడియో తీసిన మరిది

దిశ, వెబ్‌డెస్క్: మానవత్వాన్ని మంటగలిపిన ఘటన తమిళనాడు‌లో వెలుగుచూసింది. తన కండ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటున్న వదినను కాపాడాల్సిన మరిది అడ్డుపడలేదు. పైగా నిప్పుల్లో కాలిపోతుంటే దగ్గరుండి మరీ వీడియో తీశాడు. అన్న చేసిన మోసానికే తన వదిన ఆత్మహత్య చేసుకుంటుందని తెలిసినా.. తనకు తానే చనిపోతోందన్న ఆధారం కోసం ఈ వీడియో తీయడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌ సమీపంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన మాలతి అనే మహిళ మూడేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మూడేళ్లు తనతో కాపురం చేసిన సతీష్ ఒక బిడ్డ జన్మించాక.. మాలతిని వదిలేశాడు. ఆ తర్వాత మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న సతీష్ సోదరుడు.. శరవణ కుమార్‌ ఆత్మహత్య దృశ్యాలను దగ్గరుండి వీడియో తీయడం దారుణం. శరవణ ప్రవర్తనలో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీష్‌తో పాటు శరవణ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు.

Advertisement