పుట్టిన రోజు జరుపుకుంటున్న 110 ఏండ్ల తాత.. అందరూ ఒక్కసారి విషెస్ చెప్పండి

by Disha Web Desk 20 |
పుట్టిన రోజు జరుపుకుంటున్న 110 ఏండ్ల తాత.. అందరూ ఒక్కసారి విషెస్ చెప్పండి
X

దిశ, ఫీచర్స్ : నేటి కాలంలో మానవ జీవన శైలి 50-60 ఏళ్లకే అలసి పోయేలా తయారైంది. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రత్యక్ష కారణం. కానీ ఓ తాత మాత్రం 80, 90 ఏండ్లు కాకుండా ఏకంగా 110 ఏండ్లు జీవించాడు. అంతే కాదు ఆయన 110 ఏండ్లలో పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంత వయస్సు వచ్చినా ఆ తాత ఇప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. మరి ఆయన ఎవరు పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం గత నెలలో తన 110వ పుట్టినరోజును జరుపుకున్న అమెరికాలోని న్యూజెర్సీ నివాసి విన్సెంట్ డ్రాన్స్‌ఫీల్డ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విన్సెంట్ డ్రాన్స్‌ఫీల్డ్ ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యను ఎదుర్కోలేదని చెప్పారు.

సుదీర్ఘ జీవిత రహస్యం..

1914 లో జన్మించిన తాత ఇంత వయసొచ్చినప్పటికీ లిటిల్ ఫాల్స్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడట. అతను తనకు సహాయం చేయడానికి ఏ పని మనిషిని కూడా నియమించుకోలేదు. ఇంత వయసొచ్చినా తన పనులన్నీ తానే చేసుకుంటాడు. 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ మంచి జీవితాన్ని గడుపుతున్న వారిలో అతను ఒకడని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల మాత్రమే ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నాడని తెలుపుతున్నారు.

ఆయన ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోలేదట. ఈ కారణంగానే మోకాళ్ల నొప్పులు తప్ప మరే ఇతర వ్యాధుల బారిన పడలేదని చెబుతారు. తన ఒక ఇంటర్వ్యూలో, అతను 15 నుంచి 70 సంవత్సరాల వయస్సు వరకు పనిచేశానని చెప్పాడు. మూడంతస్తుల ఇంట్లో ఒంటరిగా ఉంటున్న డ్రాన్స్ ఫీల్డ్ ఈ వయసులో తన పనులన్నీ తానే చేసుకుంటాడట.



Next Story

Most Viewed