పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి : యశస్విని రెడ్డి

by Disha Web Desk 23 |
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి : యశస్విని రెడ్డి
X

దిశ, రాయపర్తి : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డిలు కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని సన్నూరు కేశవపురం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వారి పాలనలో ప్రజలు విసుకు చెందారన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యకర్తలంతా కొత్త పాత తేడా లేకుండా ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక..

మండలంలోని సన్నూరు గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని కొత్త పాత తేడా లేకుండా అందరు ఐక్యతగా కలిసి ఉండాలని పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,కృష్ణారెడ్డి, మాచర్ల ప్రభాకర్ ,పెండ్లి మహేందర్, రెడ్డి నాయకులు, ముద్రబోయిన వెంకటేశ్వర్లు ,వనజ రాణి, చెడు పాక ఎల్లయ్య పాల్గొన్నారు.

Next Story

Most Viewed