అతనికి బౌలింగ్ చేయడం కష్టం : హైదరాబాద్ కోచ్ అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మోట్

by Harish |
అతనికి బౌలింగ్ చేయడం కష్టం : హైదరాబాద్ కోచ్ అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మోట్
X

దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్‌పై ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. 200 స్ట్రైక్‌రేటుతో ఆడిన అతను 51 బంతుల్లో శతక్కొట్టి ముంబై విజయాన్ని ఏకపక్షంగా చేశాడు. ఈ నేపథ్యంలో సూర్యపై హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ సైమన్ హెల్మోట్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ.. సూర్యకుమార్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని అంగీకరించాడు. ‘అతను ఎక్కువగా తప్పిదాలు చేయలేదు. మేము అతన్ని అవుట్ చేయడానికి ప్రయత్నించాం. కానీ, అతను బాగా ఆడాడు. సూర్యకుమార్ అసాధారణ ఆటగాడు. భారత జట్టులో చోటు కోసం అతను ఎప్పుడూ డిమాండ్ చేస్తాడు. వరల్డ్ కప్‌లో అతను కచ్చితంగా ప్రభావం చూపుతాడు.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story