ఆ జిమ్‌లో యువతులకు వేధింపులు

by Shyam |
ఆ జిమ్‌లో యువతులకు వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రావిటీ జిమ్‌లో యువతులను వేధింపులకు గురిచేస్తున్న విషయం కలకలం రేపుతోంది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే.. పొద్దున్నే ఆరోగ్యం రీత్య జిమ్‌కు వచ్చిన యువతుల ఫొటోలు తీసిన యజమాని సాయి నరేష్, తన స్నేహితులకు పంపిస్తున్నారు.

విషయం పసి గట్టిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లో ట్రోల్ కాల్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జిమ్ యజమాని సాయి నరేశ్, ఆయన సోదరుడు అనుదీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా జిమ్‌కు సంబంధించిన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు తెలిపారు.

Advertisement

Next Story