- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పోలీసు దొంగను పట్టాడు.. కానీ, కరోనాకు చిక్కాడు
గాంధీనగర్: ఆ పోలీసు తన విధులను సక్రమంగా నిర్వర్తించాడు. కష్టపడి ఓ దొంగను చేజ్ చేసి పట్టుకున్నాడు. కానీ, ఆ దొంగకు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేనా.. ఆ దొంగను పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్‌కు దొంగ ద్వారా వైరస్ సోకింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
వడోదర జిల్లాలో 52 ఏళ్ల దొంగ, అతని మిత్రుడు కలిసి ఓ కిరాణా కొట్టులోని రూ. 4,265ల విలువ చేసే పాన్ మసాలాను దొంగిలించారు. సోమవారం ఆ ఘటనపై కిరాణా కొట్టు యజమాని ధబోయ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 35 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్, ఇతర సిబ్బంది కలిసి దొంగలను గాలించే పని మొదలుపెట్టారు. మంగళవారం ఆ ఇద్దరు దొంగలను పోలీసులు గాలించి పట్టుకున్నారు. పట్టుకోగానే ప్రొటోకాల్ ప్రకారం.. దొంగల అరెస్టుకు ముందు మెడికల్ పరీక్షలకు పంపగా.. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసుల నమూనాలను కరోనా పరీక్షలకు పంపినట్టు డీఎస్‌పీ కల్పేష్ సోలాంకి తెలిపారు. ఇందులో ఒక హెడ్ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. కాగా, ఆ దొంగకు వైరస్ ఎక్కడి నుంచి సోకిందో ఇంకా తేలలేదని జిల్లా ప్రధాన వైద్యాధికారి ఉదయ్ తిలావత్ తెలిపారు. దీంతో ఆ దొంగ నివసిస్తున్న ప్రాంతంలోని 150 బిల్డింగుల్లోని 600 మందిని అధికారులు కమ్యూనిటీ కంటైన్‌మెంట్‌లో ఉంచారు.
TAGS: gujarat, theft, thief, head constable, police, infected, positive, corona