- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగశౌర్య తండ్రికి నోటీసులు.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : హీరో నాగశౌర్యకి చెందిన ఫామ్ హౌస్‌లో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, పట్టుబడిన వారిలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతో పాటు భూ కబ్జా కేసులో నిందితుడైన గుత్తా సుమన్ ఉన్నారు. గతంలోనే గుత్తాసుమన్ విజయవాడలోని మామిడితోటల్లో పేకాట క్లబ్‌లు నిర్వహించేవారు. ఈక్రమంలో పోలీసులు గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగించి చరిత్ర మొత్తం బయటకు లాగుతున్నారు. పేకాట నిర్వహణ నాగశౌర్యకు తెలుసా? తెలియదా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌కు నోటిసులు పంపించారు. ఫామ్ హౌస్‌కు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ తో హాజరుకావాలని సూచించారు. ఫామ్ హౌస్ దగ్గర AP21BM9527, AP BR 9000, TS09EZ3399, AP09CN7555 నెంబర్లు గల కార్లను పోలీసులు సీజ్ చేశారు.