- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టుల కట్టడికి దర్బార్‌లు
దిశ ప్రతినిధి, కరీంనగర్: పోలీసులు పల్లెబాట పట్టారు. అటవీ గ్రామాల్లోని ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా మావోయిస్టుల వైపు పల్లెజనం దృష్టి మరలకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత పోలీసులు పల్లె జనంతో సమావేశమవుతున్నారు. ప్రత్యేకంగా గోదావరి పరివాహక ప్రాంతమైన భూపాపల్లి జిల్లా మహదేవపూర్, పల్మెల మండలాల్లో పోలీసులు అటవీ గ్రామాలకు వెళ్లి దర్బార్‌లు నిర్వహిస్తున్నారు.
సమస్యలు చెప్పండి..
పల్లె ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని ఆయా గ్రామాల ప్రజలకు పోలీసులు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు అయినా సరే వాటిని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా పోలీసులను లేదా సంబంధిత శాఖల ఆఫీసర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. నక్సల్స్‌ను ఆశ్రయించడం కానీ, ఆశ్రయం కల్పించడం కానీ చేయొద్దని చెబుతున్నారు. సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థ వల్లే పల్లె అభివృద్ధి వైపు సాగుతున్నదని గ్రామవాసులకు వివరిస్తున్నారు. అన్నిటికీ తాము అందుబాటులో ఉంటామన్ని విషయాన్ని మరిచిపోవద్దని గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీసులు చెప్తున్నారు.
బార్డర్ కావడం వల్లే..
తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న మహదేవపూర్, పల్మెల మండలాలపై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో బలగాలు ప్రతి పల్లెనూ టచ్ చేసి అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నారు. వారితో సమావేశమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతం గుండి పల్మెల మండలంలోని పలు గ్రామాలకు మావోయిస్టులు వచ్చే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు పోలీసు ఆఫీసర్లు సమాయత్తం అయ్యారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి నక్సల్స్ షెల్టర్ తీసుకునే అవకాశాన్ని ఏ మాత్రం ఇవ్వకూడదన్న లక్ష్యంతో కాటారం సబ్ డివిజన్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.