వకీల్‌ సాబ్‌కు షాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కష్టమే?

by Shyam |
Vakilasab
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమా వస్తుందంటే పండగ చేసుకోడానికి సిద్ధంగా ఉంటారు అభిమానులు. అంతేగాకుండా.. పవన్ కోసం అభిమానులు రికార్డులు అలా ఇచ్చేస్తుంటారు. తాజాగా.. వకీల్ సాబ్ ట్రైలర్ కూడా పవన్ సత్తా చాటింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇంతవరకూ తెలుగు ఇండస్ట్రీలోనే ఏ హీరోకు సాధ్యం కానీ, రికార్డు సృష్టించడమే కాకుండా బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. యూట్యూబ్‌లో వకీల్ సాబ్ ట్రైలర్ 23 గంటల 40 నిముషాల్లోనే వన్ మిలియన్ లైక్స్ సాధించి, అరుదైన ఫీట్ అందుకుంది.

అయితే.. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఏప్రిల్ 3వ తేదీన హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన వకీల్‌సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జె.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని తలపెట్టి ఇందుకోసం జూబ్లీహిల్స్‌ పోలీసులకు అనుమతి మంజూరు కోరుతూ లేఖ రాసింది. అయితే కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ ఇటీవలనే జీవో జారీ చేశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు కుదరవని స్పష్టం చేశారు.

Advertisement

Next Story