- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన హత్య కేసు మిస్టరీ.. అందుకే చంపానన్న కొడుకు..
దిశ, నల్లగొండ: మద్యానికి బానిసై గొడవ చేస్తున్నాడనే నెపంతోనే తండ్రిని హతమార్చాడని డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నల్లగొండ మండలం చర్లపల్లిలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు. చర్లపల్లి గ్రామానికి చెందిన మందడి బుచ్చిరెడ్డి మద్యానికి బానిసై ఇంట్లో గొడవలు చేస్తున్నాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసి తన పరువు పోతోందని, తనకు ఎవరూ కూడా వివాహం చేసుకోవడానికి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రావట్లేరని, బుచ్చిరెడ్డి కుమారుడు నరేష్ రెడ్డి మదన పడుతుండేవాడు.
అదే క్రమంలో ఈ నెల 12వ తేదీ సాయంత్ర బుచ్చిరెడ్డి మరోసారి మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. గొడవ చేయొద్దని నరేష్ రెడ్డి వారిస్తుండగా ఇద్దరి మధ్య మాటలు పెరిగడంతో కోపొద్రిక్తుడైన కుమారుడు విరిగిన ప్లాస్టిక్ కుర్చి కాలుతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. స్పృహ కోల్పోయిన బుచ్చిరెడ్డిని నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే రాత్రి సమయంలో మృతిచెందాడు. మృతుడి భార్య సునంధ అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ముమ్మరమైన దర్యాప్తు చేపట్టి, ఈ నెల 15న నిందితుడిని చర్లపల్లిలోని తన ఇంట్లోనే అరెస్టు చేసి, సోమవారం రిమాండ్ కు తరలించారని తెలిపారు. చిన్న విషయాలకు మానవతా విలువలు, రక్త సంబంధాలను మర్చిపోయి, ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, వన్ టౌన్ సీఐ బాలగోపాల్, రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.