- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెది హత్య కాదు.. ఆత్మహత్యే..
దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లా ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి ఆర్థిక ఇబ్బందులు భరించలేకనే పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈనెల 18న భువనేశ్వరి దహనం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై నిగ్గు తేల్చాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్‌చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు.
భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓలా యాప్‌లో స్నేహితులతో చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. ఇరవై రెండేళ్ల భువనేశ్వరి నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పని చేస్తోంది. భువనేశ్వరి రోజూమాదిరిగానే శుక్రవారం సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం 6.49 గంటల సమయంలో తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ఆతర్వాత ఇంటికి రాలేదు. తల్లి జానకి రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆమె వెతుకులాడటం ప్రారంభించింది. రాత్రి 8 గంటల తర్వాత దశరాజుపల్లి రోడ్డులోని చినవెంకన్న కుంట వద్ద మూడు చక్రాల సైకిల్‌పై ఓ యువతి తగులబడుతుందన్న సమాచారాన్ని కిమ్స్ ఆసుపత్రి సెక్యూరిటీ ఆఫీసర్ తాలూకా పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఫైరింజన్‌ను పిలిపించి మంటలు ఆర్పారు.