- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండు రోజుల క్రితం కరీంనగర్ కోర్టు బస్టాప్ డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. మృతురాలిని గుర్తించకపోవడంతో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ను పోలీసులు అన్ని కోణాల్లో చేపట్టారు. సీసీ ఫుటేజ్ అందించిన క్లూను కీలక ఆదారంగా మార్చుకున్న పోలీసులు ఎట్టకేలకు హత్య కేసు మిస్టరీని ఛేదించినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన మహిళగా మృతురాలిని గుర్తించిన పోలీసులు ఆమెను భర్తే హత్య చేశాడని ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్టు సమాచారం.
అసలేం జరిగింది..?
హంతకునికి మృతురాలికి చిరుప్రాయంలో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ తరువాత వీరిద్దరి మధ్య దూరం ఏర్పడడంతో ఆమె తాత మరోకరికి ఇచ్చి పెళ్లి చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తిరిగి సుమారు 10 ఏళ్ల క్రితం మళ్లీ హంతకునితో సహజీవనం చేస్తుండగా హైదరాబాద్ లో కాపురం పెట్టారు. అక్కడ వేరేకోరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను మరో చోటకు మార్చారు. అక్కడ కూడా వివాహేతర బంధం పెట్టుకోవడంతో ఆమె భర్త కౌన్సిలింగ్ నిర్వహించి కరీంనగర్ తీసుకొచ్చారు.
కోర్టు చౌరస్తాకు చేరుకున్న వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడతానని డివైడర్ దాటి పరిగెత్తడంతో ఆమెను వాధించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మృతురాలికి మరో వాహనం తాకడంతో గాయమైంది. అయినా వీరిద్దరి మధ్య తగవులాట చోటు చేసుకోవడంతో ఆమె తలపై బాదడంతో అక్కడిక్కడే మరణించింది. దీంతో ఆమెను డ్రైనేజీలో పడేసిన హంతకుడు అక్కడి నుంచి వెల్లిపోయాడు. ఆమె శవాన్ని పోలీసులు తీసుకెళ్లే వరకు అతని తమ్ముడు కోర్టు చౌరస్తాలోనే ఉండి అక్కడి నుంచి వెల్లిపోయాడు.
అయితే పోలీసులు సీసీ కెమెరాతో పాటు కోర్టు ఏరియా టవర్ లొకేషన్ లో ఉన్న మొబైల్స్ కాల్స్ డాటా కూడా సేకరించి అనుమానిత నెంబర్లను ఆదారం చేసుకుని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు సహకరించిన ఈ నిందితులను పట్టుకునేందుకు పోలీసు స్పెషల్ టీం రంగంలోకి దిగినట్టు సమాచారం.