- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్నేహాన్ని చాటుకున్న పోలీసులు.. బ్యాచ్ మేట్‌కు రూ.3.15 లక్షల సాయం
దిశ, నల్లగొండ: ఆపదలో ఉన్న మిత్రుడికి ఆపన్న హస్తం అందించి తమ స్నేహాన్ని చాటుకున్నారు పోలీసులు. బ్యాచ్ మేట్ పడుతున్న కష్టాలకు చలించిన 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు ఆర్థిక భరోసా కల్పించి మానవత్వాన్ని నిరూపించుకున్నారు .
నల్లగొండ పట్టణానికి చెందిన అక్తర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అక్తర్ విధి నిర్వహణ చేయలేని స్థితిలో ఉండడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ అర్హత లేక ఉద్యోగం లభించలేదు. దీంతో అక్తర్ ఆర్థిక సమస్యలతోపాటు మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. అక్తర్ పరిస్థితిని తెలుసుకున్న 1989 బ్యాచ్ అధికారులు చలించిపోయారు. మిత్రుడిని ఆదుకోవాలని అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అంతా కలిసి రూ.3.15 లక్షలను జమ చేసి గురువారం అక్తర్ కుటుంబానికి అందించారు. భవిష్యత్తులోనూ అక్తర్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బ్యాచ్ మేట్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, మూసి వెంకయ్య, జహంగీర్, జంగయ్య, శ్రీనివాస్, శౌరి, దుర్గారెడ్డి తదితరులున్నారు.