మిర్యాలగూడలో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

by Sumithra |
DIG Ranganath
X

దిశ, నల్లగొండ: మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ పరిధిలో పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం మంగళవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కొత్తపేట ప్రాంతానికి చెందిన పోతుగంటి అనిల్ కుమార్, హయత్ నగర్‌కు చెందిన జ్ఞానేశ్వర్ అలియాస్ గణేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలోని సైదిరెడ్డి అలియాస్ బబ్బుకు గంజాయి విక్రయిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి ముగ్గురునీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించి, వారినుంచి సుమారు 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వీరికి తూర్పు గోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాధ్ అలియాస్ ప్రదీప్, తూర్పు గోదావరి జిల్లా బచ్చులూరు గ్రామానికి చెందిన వేమా జాన్ రెడ్డిలు గంజాయి విక్రయించినట్లు చెప్పారు. ఈ సమాచారంతో అక్కడ కూడా దాడులు నిర్వహించి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారినుంచి 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని వివరించారు. డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి పర్యవేక్షణలో గంజాయి ముఠాను పట్టుకోవడంలో సఫలమైన మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ సదా నాగరాజు, టాస్క్‌ఫోర్స్ సీఐ రౌతు గోపి, ఎస్ఐ అంతిరెడ్డి తదితరులను డీఐజీ రంగనాథ్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed