యువకులతో గుంజీలు తీయించిన ఎసై

by  |
యువకులతో గుంజీలు తీయించిన ఎసై
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తస్తోంది. దీని మూలంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఈ ఆంక్షలను సైతం లెక్కచేయకుండా ఏ పని లేకున్నా అనవసరంగా రోడ్లపై యువకులు వస్తున్నారు. దీనిని గుర్తించిన వనపర్తి జిల్లా కొత్తకోట ఎస్ఐ నాగ శేఖర రెడ్డి పనిష్‌మెంట్‌గా అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన యువకులతో గుంజీలు తియించారు. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలను తూచా తప్పకుండా పాంటించి, కరోనా వైరస్ బారిన పడకుండా చూసుకునే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని, విధులు నిర్వహిస్తున్న అధికారులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags: Police, chastise, teenagers, violating, lockdown, roed, mahaboobnagar

Advertisement

Next Story