ప్రేమించినవాడే ప్రాణం తీశాడు

by Shyam |   ( Updated:2020-04-01 05:39:38.0  )

దిశ, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద కలకలం రేపిన మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన మహిళ సిక్కిం రాష్ట్రానికి చెందినట్లు పోలీసుల దర్పాప్తులో తేలింది. ప్రేమికుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి అతడి బంధువు కూడా సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. వివరాళ్లోకి వెళితే మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. కాగా, ఫేస్ బుక్ ద్వారా మహిళకు 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, నిత్యం వీరిద్దరి మధ్య జరిగిన తగాదాలే ఆమె హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన రోజే నిందితుడు ఓ కారును కిరాయికి తీసుకొని.. మృతదేహాన్ని ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లికి తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు నిర్దారించారు. ఆపై కేసును తప్పుదోవ పట్టించేందుకు తలపై బండరాయితో మోదీ, దుస్తులు తీసుకెళ్లారు. అలాగే కొద్దిగా బంగారం కూడా వదిలివెళ్లినట్లు తెలుస్తోంది.

Tags: police chased ,Woman murder case, under Thangadapalli bridge, rangareddy

Advertisement

Next Story