- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొబ్బరి పీచు కింద గంజాయి!

X
దిశ, విశాఖపట్నం: విశాఖలో మరోసారి గంజాయి కలకలంరేపింది. నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ సమీపంలో కంటైనర్‌లో కొబ్బరి పీచు మాటున 77 బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న 1300 కేజీల గంజాయిని నర్సీపట్నం టౌన్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి ఉత్తర ప్రదేశ్‌కి చెందిన కంటైనర్ (యూపీ21సిఎన్ 1149)లో కొబ్బరిపీచులో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు చేపట్టగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గురించిన టౌన్ సిఐ స్వామినాయుడు, తక్షణమే కంటైనర్‌ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను ఆరెస్ట్ చేసినట్టు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలిస్తామన్నారు.
Next Story