- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాధినేని యామిని సేఫ్ గేమ్..??
దిశ, వెబ్ డెస్క్: టీడీపీకి మంచి గ్లామర్ యాడ్ చేసిన సాధినేని యామిని బీజేపీలో చేరిన తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు. టీడీపీలో సాధారణ మహిళా కార్యకర్తగా ఉన్న ఆమె… చంద్రబాబు నాయుడుకి మద్దతుగా తెలంగాణా యాసలో కెసిఆర్ ని విమర్శిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వైరల్ కావడంతో ఆమె పేరు మార్మోగింది. అమాంతం ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆమెకి టీడీపీ అధికార ప్రతినిధి పట్టం కట్టిపెట్టారు చంద్రబాబు నాయుడు.
అధికారిక హోదా కల్పించడంతో చంద్రబాబుపై ఈగ వాలినా తోలడానికి ముందుండేది యామిని. గల్లీ లీడర్ల నుండి పీఎం స్థాయి లీడర్ల వరకు బాబుపై చిన్న కామెంట్ చేసినా పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ దులిపేసేది. చిన్న పిల్లలు పాఠం చదివినట్టు చెప్పే తన డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోకపోయినా చూడటానికి అట్రాక్టివ్ గా ఉండడంతో టీడీపీ శ్రేణులు ఆమెను బాగానే ఫాలో అయ్యేవారు. ఎప్పటి నుండో అధికార ప్రతినిధిగా ఉన్న పంచుమర్తి అనురాధకంటే అతి తక్కువ సమయంలోనే ఈమెకు మాంచి పొలిటికల్ ఇమేజ్ లభించింది.
2019 లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో ఉన్న ఆమె కుటుంబ వ్యాపారాలను విస్తరించుకోవచ్చనో లేక రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందనో భావించిన ఆమెకి నిరాశే ఎదురైంది. టీడీపీ ఘోరపరాజయం చవిచూసింది. దీని తర్వాత ఏ వర్గాలైతే ఆమెను నెత్తిన పెట్టుకున్నాయో అవే వర్గాలు ఐరన్ లెగ్ అని విమర్శలు కూడా చేశాయి. ఎన్నికల ముందు వైసీపీపై దుమ్మెత్తిపోసిన ఆమె భయంతోనో, భవిష్యత్తు మీద జాగ్రత్తతోనో తెలియదు కానీ బీజేపీ గూటికి చేరింది.
పార్టీ మారి సేఫ్ జోన్ లో ఉన్నట్టు అనిపిస్తున్నా… యామిని మాత్రం సైలెంట్ అయిపోయింది. టీడీపీలో కనీసం కార్యకర్తగా ఉన్నప్పుడు చేసిన హడావిడి కూడా ఇప్పుడామె చేయడం లేదు. అయితే సేఫ్ గేమ్ ఆడుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో టీడీపీ గెలుపుపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో బీజేపీ పైన కూడా పదునైన విమర్శలు గుప్పించింది యామిని. ఇప్పుడు గత్యంత్రం లేక అదే పార్టీలో చేరాల్సొచ్చింది.
అందుకే ఇప్పుడు స్తబ్దుగా ఉంటోంది అంటున్నారు విశ్లేషకులు. తొందరపడి ఏ పార్టీని విమర్శించినా భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందు జాగ్రత్త తీసుకుంటుంది అంటున్నారు. 2024 ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న పార్టీల బలాబలాలు, రాజకీయ సమీకరణాలను బట్టి అప్పుడే నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని అనుకుంటున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
యామినిపై తిరుపతిలో కేసు:
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎస్వీబీసీ లో లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంపై సాధినేని యామిని టీటీడీని ప్రశ్నించారు. హిందువుల కానుకలను అన్యమతస్థుల యాత్రలకు ఉపయోగిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. హిందువుల కానుకలు, విరాళాలతో నడిచే టీటీడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం హిందువులను బాధిస్తోందన్నారు. రాజకీయాలకి సంబంధం లేకుండా ఒక హిందువుగా నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను అన్నారు. అయితే ఇక్కడ కూడా ఆమె రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.
కాగా ఆమె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం యామినిపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెపై ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద కేసు నమ్మొడు చేసారు. కాగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆమె… ఒక హిందువుగా టీటీడీని ప్రశ్నించిందని కొందరు భావిస్తున్నారు. మరి కొందరేమో జనాలు ఆమెను మర్చిపోకుండా అయోధ్యలాంటి అంశాన్ని తీసుకుని రాజకీయ ప్రస్తావన లేకుండా వీడియో చేసిపెట్టి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.