- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓయో హోటల్‌లో వ్యభిచారం..
దిశ, కంటోన్మెంట్: హోటల్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యవహారాన్ని బోయిన్ పల్లి పోలీసులు రట్టుచేశారు. హోటల్ పై దాడి చేసి ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచారు. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. న్యూ బోయిన్ పల్లి సెంటర్ పాయింట్ చౌరస్తాలోని ఓయో హోటల్‌లో కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు ఈ నెల 9న ఆర్దరాత్రి సదరు హోటల్ పై డీఐ అక్బర్ అలీ, ఎస్ఐ సుధాకర్ రెడ్డిలు సిబ్బందితో కలిసి దాడులను నిర్వహించారు.
ఈ దాడుల్లో వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ అమ్మాయితోపాటు మలక్ పేటకు చెందిన విటుడు అమీర్ మలిక్(29)లను రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే హోటల్ నిర్వహకుడు నితిన్, అందులో పనిచేసే బీహార్‌కు చెందిన రాజ్ కుమార్ ఠాకూర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితిన్ , రాజ్ కుమార్, అమీర్ మాలిక్ లను ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా, అమ్మాయిని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నింధితుడు సంజు పరారీలో ఉన్నట్లు ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపారు