రూ. 2 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

by srinivas |
రూ. 2 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం
X

దిశ, ఏపీ బ్యూరో: ఎర్ర చందనం స్మగ్లర్ల స్థావరాలపై కడప జిల్లా ప్రత్యేక పోలీసుల బృందం బుధవారం దాడులు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కర్నాటకలో దాడులను చేపట్టింది. దాదాపు 30 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 28 మంది కడప జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఉన్నారు. ఇద్దరిని కర్ణాటకకు చెందిన అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.2 కోట్లు విలువ చేసే 98 ఎర్రచందనం దుంగలతో పాటు 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story